News November 18, 2024
ADB: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన అనిత (42) స్థానిక తాంసి రైల్వే గేట్ వద్ద వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ లారీ ఆమె కాళ్ల పై నుంచి వెళ్లింది. దీంతో ఆమె ఒక కాలు నుజ్జు నుజ్జు అయి తీవ్ర గాయాల పాలయింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో ఆమెను రిమ్స్‌కు తరలించారు.
Similar News
News December 1, 2025
ADB: రామన్న.. సర్పంచ్ నుంచి మంత్రి వరకు

సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదగాలంటే రాజకీయాల్లో ఎంతో నిలదొక్కుకోవాలి. అలాంటి అవకాశమే మాజీ మంత్రి జోగు రామన్నను వరించింది. జోగు రామన్న జైనథ్ మండలంలోని దీపాయిగూడకు సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జడ్పీటీసీగా సేవలందించారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన స్వరాష్ట్ర సాధనలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. అనంతం జరిగిన మూడు ఎన్నికల్లో గెలుపొందారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం KCR క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.
News December 1, 2025
ADB: నేటి నుంచి కొత్త వైన్స్ షాపులు ఓపెన్

జిల్లాలో ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం పాలసీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కొత్త పాలసీ ద్వారా ఎంపికైన నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి తెరచుకోనున్నాయి. జిల్లాలో మొత్తం 40 మద్యం షాపులు ఉండగా, ADB పరిధిలో 18, ఉట్నూర్ పరిధిలో 9, ఇచ్చోడ పరిధిలో 13 వైన్స్‌లు ఉన్నాయి. ADBలో ఈ ఏడాది కొత్తగా 3 లిక్కర్ మార్టులు ఏర్పాటు కానుండగా, వీటికి అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
News November 30, 2025
రెండో విడత నామినేషన్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

నేటి నుంచి రెండో విడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు ఫారం నంబర్ -1 నుంచి 10 వరకు ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ప్రజల నుంచి ఎక్కువ నామినేషన్లు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


