News March 22, 2024
ADB: రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి

నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ రాజ్కుమార్ మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సవేల గ్రామానికి చెందిన డాక్టర్ రాజ్కుమార్ కడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. గత రాత్రి భుక్తాపూర్ వద్ద ఆయన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో డాక్టర్ రాజకుమార్ మృతిచెందారని కడెం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
Similar News
News February 25, 2025
ADB: మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించినట్లు సంస్థ రీజినల్ మేనేజర్ సోలోమన్ తెలిపారు. రీజినల్ పరిధిలోని నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల నుంచి ఈనెల 25 నుంచి 27వ వరకు వేములవాడ, వేలాల, బుగ్గ, నంబాల, వాంకిడి, ఈజ్గాంకు 93 బస్సులను 833 ట్రిప్పుల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
News February 25, 2025
ఆదిలాబాద్: ఈనెల 28 వరకు వారోత్సవాలు

ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు తప్పనిసరిగా బాధ్యతగా డబ్బును పొదుపు చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆర్బీఐ వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ వారోత్సవాలను నిర్వస్తున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారోత్సవాల పోస్టర్లను అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 24, 2025
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

శాసన మండలి ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిబంధనలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ నెల 27న జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించి నివేదికలను త్వరగా అందజేయాలన్నారు.