News December 12, 2024
ADB: లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కోర్టులలో ఏళ్ల పాటుగా పరిష్కరించబడని కేసులు రాజీ పడటంతో తక్షణం పరిష్కరించబడి సమయం, డబ్బులు, వృధా కాకుండా ఉంటాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయాన్ని పొంది ఉపశమనం పొందవచ్చు అని అన్నారు.
Similar News
News November 9, 2025
ADB: రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు కోచ్లు అందుబాటులోకి తెచ్చినట్లు డివిజన్ ప్రజా సంబంధాల అధికారి రాజేష్ షిండే తెలిపారు. నాందేడ్- మన్మాడ్- నాందేడ్ ప్యాసింజర్, పూర్ణ- ఆదిలాబాద్ రైళ్లకు ఆదివారం నుంచి అదనపు కోచ్లు ఉంటాయి. ఆదిలాబాద్- పర్లి ప్యాసింజర్, వైజ్నాథ్- అకోలాకు ఈ నెల 10 నుంచి, అకోలా-పూర్ణ, పర్లివైజ్నాథ్- పూర్ణ రైళ్లకు ఈ నెల 11 నుంచి కోచ్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
News November 8, 2025
తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
News November 8, 2025
గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


