News December 12, 2024
ADB: లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ
ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కోర్టులలో ఏళ్ల పాటుగా పరిష్కరించబడని కేసులు రాజీ పడటంతో తక్షణం పరిష్కరించబడి సమయం, డబ్బులు, వృధా కాకుండా ఉంటాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయాన్ని పొంది ఉపశమనం పొందవచ్చు అని అన్నారు.
Similar News
News January 20, 2025
ఇంద్రవెల్లి: ప్రకృతి ప్రేమికులు ఆదివాసులు
ప్రకృతిని, అడవిని దైవంగా భావిస్తూ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్న వేళ ఆదివాసులు ఇంద్రాయి, నాగోబా, జంగుబాయి దేవతలకు పూజలు చేస్తారు. గంగాజలం తీసుకువెళ్లే మెస్రం వంశీయులు మొదట ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తారు. అనంతరం గోదావరి జలాలతో నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. జాతర పూర్తయిన తర్వాత ఆదివాసులు జంగుబాయిని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
News January 20, 2025
ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు
ఓ యువకుడిపై ADB 1 టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. DSP జీవన్ రెడ్డి వివరాలు.. ఓ కళాశాలలో చదువుతున్న బాలిక (17)తో సుందరయ్యనగర్‌కు చెందిన చౌహాన్ అంకుష్ (23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఈనెల 10న ఆమెను HYD తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం అతడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.
News January 20, 2025
నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో కుమ్రం మల్కు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. గుడిహత్నూర్ సూర్యపేట గ్రామంలో నుంచి జంగుబాయి దైవదర్శనానికి వెళ్తున్న గ్రామస్థుల ఐచర్ వ్యాన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మల్కు మృతిచెందగా.. పలువురు చికిత్స పొందుతున్నారు.