News January 8, 2025
ADB: వన్యప్రాణులకు ఉచ్చు.. ముగ్గురి రిమాండ్

వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు రేంజ్ అధికారి ముసవీర్, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రావణ్ తెలిపారు. బెజ్జూర్ రేంజ్ పరిధిలోని ఏటిగూడ సమీపంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఏటిగూడెంకు చెందిన మడే ప్రభాకర్, తుమ్మల మహేష్, జక్కం వినోద్ కుమార్ విద్యుత్ అమరుస్తుండగా పట్టుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
Similar News
News November 22, 2025
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్‌లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్‌లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.