News April 16, 2025

ADB: విద్యార్థులపై విష ప్రయోగం.. ఒకరి అరెస్టు: SP

image

ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై <<16115277>>విషప్రయోగం<<>> చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగుమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.

Similar News

News December 4, 2025

KMM: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

image

స్థానిక ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఏకంగా సొంత అక్కాచెల్లెళ్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో చిట్టూరి రంగమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా మల్లెంపుడి కృష్ణకుమారి బరిలో ఉన్నారు. వీరిద్దరూ కలిసిమెలిసి ఉన్నవారే కావడంతోపాటు కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. కాగా ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందోనని మండలంలో చర్చ జరుగుతోంది.

News December 4, 2025

పాలమూరు: సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ

image

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైద్య విద్యార్థిని కే.ఎన్. నిఖిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నామినేషన్ వేశానని.. గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కాగా ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలోని యువత సైతం అభినందిస్తున్నారు.

News December 4, 2025

అదనపు సిబ్బందిని తీసుకోండి.. SIRపై సుప్రీంకోర్టు

image

‘SIR’ విధుల్లో ఒత్తిడితో BLOల <<18435836>>ఆత్మహత్య<<>> ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బందులు వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పని గంటలనూ తగ్గించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ECతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సరైన కారణంతో విధుల నుంచి మినహాయింపు కోరితే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.