News February 19, 2025
ADB: వివాహేతర సంబంధమే కారణం!

బావను బావమరిది <<15502338>>హత్య<<>> చేసిన ఘటన తలమడుగులో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. CI ఫణిందర్ వివరాలు.. ADB లోని తంతోలికి చెందిన మహేందర్(40)కు రుయ్యాడికి చెందిన నవితతో వివాహమైంది. కాగా కొన్నిరోజులుగా మహేందర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నిన్న అశోక్ ఇంటికి వచ్చి మహేందర్కు నచ్చజెప్పేందుకు చూశాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో అశోక్ తన బావను కత్తితో పొడిచి హత్య చేశాడు.
Similar News
News November 17, 2025
రాజకీయ కుటుంబాల్లో ఇంటిపోరు.. పార్టీల కుదేలు

రాజకీయాల్లో అవకాశాల కోసం ఆడబిడ్డల పోరు పొలిటికల్ ఫ్యామిలీలలో చిచ్చు పెడుతోంది. APలో జగన్ సోదరి షర్మిల, TGలో KTR చెల్లెలు కవిత బాటలోనే బిహార్లో తేజస్వి సోదరి రోహిణి బంధాలను తెంచుకున్నారు. ఇంటి పోరుతో ఆయా పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికలకు ముందు షర్మిల వేరుకుంపటి పెట్టుకోగా, ఎన్నికల తర్వాత కవిత, రోహిణి తమ బాధను వెళ్లగక్కారు. రానున్న రోజుల్లో ఈ గొడవలకు ముగింపు దొరుకుతుందా? వేచిచూడాల్సిందే.
News November 17, 2025
NTR: రైళ్లలో సీసీ కెమెరాలు.. మరీ ఇంత నెమ్మదిగానా..?

రైళ్లలో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు విజయవాడ డివిజన్ పరిధిలోని కోచ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 920 కోచ్లకు గాను కేవలం 51 కెమెరాలే ఏర్పాటు చేయగా, అందులో 34 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 17, 2025
భద్రాద్రి డీసీసీ.. భట్టి VS పొంగులేటి అనుచరులు

భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గాలకు చెందిన నేతలు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు పొదెం వీరయ్య సహా మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, కొత్వాల శ్రీనివాస్, తదితర నేతలు పీఠాన్ని దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏఐసీసీ పరిశీలకుడు ఇప్పటికే అభిప్రాయాలు సేకరించారు. ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.


