News February 19, 2025
ADB: వివాహేతర సంబంధమే కారణం!

బావను బావమరిది హత్య చేసిన ఘటన తలమడుగులో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. CI ఫణిందర్ వివరాలు.. ADB లోని తంతోలికి చెందిన మహేందర్(40)కు రుయ్యాడికి చెందిన నవితతో వివాహమైంది. కాగా కొన్నిరోజులుగా మహేందర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నిన్న అశోక్ ఇంటికి వచ్చి మహేందర్‌కు నచ్చజెప్పేందుకు చూశాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో అశోక్ తన బావను కత్తితో పొడిచి హత్య చేశాడు.
Similar News
News October 18, 2025
ములుగు: ప్లాస్టిక్ కవర్లో మహిళ మృతదేహం

ములుగు మండలం తునికిబొల్లారం అయ్యప్ప చెరువులో ఓ ప్లాస్టిక్ కవర్లో మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యం అయింది. వర్గల్ మండలం మీనాజీపేట్‌కి చెందిన మంకని బాలమణిగా(50) పోలీసులు గుర్తించారు. ఆమె ఈ నెల 10న కనిపించకుండా పోవడంతో ఆమె భర్త బాలనర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమెను ఎవరో హత్య చేసి చెరువులో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
News October 18, 2025
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.
News October 18, 2025
NZB: కానిస్టేబుల్ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి సీరియస్

నిజామాబాద్ CCS కానిస్టేబుల్ ఇ. ప్రమోద్ హత్యపై డీజీపీ శివధర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిందితుడు షేక్ రియాద్‌ను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఘటనా స్థలానికి పంపించి పర్యవేక్షణకు ఆదేశించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించి, సహాయం అందించాలని సూచించారు. దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు.