News September 25, 2024

ADB: విషాదం.. పురుగు మందు తాగిన ప్రేమికులు

image

ఉట్నూరు మండలం రాంజీగూడకు చెందిన ఆత్రం హనుమంత్, నార్నూర్ మండలానికి చెందిన ఓ యువతీ ప్రేమించుకుంటున్నారు. కాగా వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందారు. సోమవారం పురుగు మందు తాగేశారు. హనుమంత్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. హనుమంత్ మృతి చెందగా, యువతిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 16, 2025

ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

image

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

News October 16, 2025

ADB: సపోర్ట్ ఇంజినీర్ పోస్టుకు దరఖాస్తులు

image

సపోర్ట్ ఇంజినీర్ పోస్టును అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అర్హతలు బీటెక్/ఎంసీఏ, టెక్నికల్ సపోర్ట్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలన్నారు. నెలకు రూ.35,000 చెల్లిస్తామని తెలిపారు. అగ్రిగేట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. 2025 జులై 1 నాటికి కనీస వయస్సు 18, గరిష్టంగా 46 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుందన్నారు.

News October 16, 2025

ADB: మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి లక్ష్యాలు, సన్నద్ధత, ప్రోత్సాహక విషయాలపై పలు సూచనలు చేశారు.