News February 13, 2025
ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు

తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్కి చెందిన షేక్ ఆసిఫ్ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.
Similar News
News December 15, 2025
‘1378 పాఠశాలల్లో నైపుణ్య విద్య’

ఆంధ్రప్రదేశ్లోని 1378 పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం నైపుణ్య విద్యను అమలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. సోమవారం పార్లమెంటులో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా సమగ్ర శిక్ష పథకం ద్వారా దశలవారీగా అన్ని పాఠశాలల్లో దీనిని విస్తరిస్తామని పేర్కొన్నారు.
News December 15, 2025
కాకినాడ: పల్స్ పోలియో విజయవంతానికి సన్నద్ధం

21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై కాకినాడ కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లకు అవగాహన కల్పించారు. విశాఖ ఎస్ఎంఓ డాక్టర్ జాషువా పాల్గొని శిక్షణ ఇచ్చారు. 1,594 బూత్ల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
News December 15, 2025
కాకాణి రిట్ పిటిషన్పై హైకోర్టు స్పందన

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.


