News March 26, 2025

ADB: వ్యక్తి హత్య.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు బుధవారం తీర్పునిచ్చారు. 2022, ఆగస్టు 21న జైనథ్ మండలం రాంపూర్‌కు చెందిన కొడిమెల ప్రభాకర్ పాత కక్షల కారణంగా కుట్ల రమేశ్‌ను కత్తితో పొడిచి చంపాడు. అప్పటి జైనథ్ ఎస్ఐ పెర్సిస్, సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. 18 మంది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారణలో నేరం రుజువైంది.

Similar News

News October 14, 2025

ADB: ‘పోలీస్ ఫ్లాగ్ డే’ షార్ట్ ఫిల్మ్, ఫొటోల ఆహ్వానం: ఎస్పీ

image

పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా అక్టోబర్ 21న నిర్వహించే కార్యక్రమాల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసుల కీర్తి ప్రతిష్ఠలు, సేవలను పెంపొందించే అంశాలపై 3 నిమిషాలకు తగ్గకుండా షార్ట్ వీడియోలను, అలాగే పోలీసులు అందించిన సేవల ఫొటోలను రూపొందించి ఈ నెల 23 లోగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు.

News October 14, 2025

ADB: 2 వారాలు.. 26 మోసాలు.. మీరూ జాగ్రత్త..!

image

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఒకరు ట్రాన్స్‌‌ఫోర్ట్ కావాలని ఆన్‌లైన్‌లో వెతకగా నకిలీ కస్టమర్ కేర్ వ్యక్తులు బాధితున్ని సంప్రదించారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందంటూ సైబరాసురులు మోసాలకు పాల్పడ్డారు. జిల్లాలో 2వారాల వ్యవధిలో 26మోసాలు జరిగాయంటే అమాయకులు ఎలా మోసపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 14, 2025

ఆదిలాబాద్: నైపుణ్యంతో న్యాక్ సర్టిఫికెట్స్

image

పనిలో వృత్తి నైపుణ్యం కలిగిన సర్టిఫికెట్ లేని అభ్యర్థులకు న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండు బ్యాచ్‌లకు ఒక రోజు RPL ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందించనున్నట్లు ట్రైనింగ్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ పొందుటకు శిక్షణ రుసుం రూ.1,200 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9154548063 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.