News October 19, 2024

ADB: ‘శక్తి అభియాన్’ సమావేశంలో పాల్గొన్న ఆత్రం సుగుణక్క

image

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలోని జవహర్ భవన్‌లో “శక్తి అభియాన్” జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్, ఇందిరా ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇన్‌ఛార్జ్ ఆత్రం సుగుణక్క, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇందిరా ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2024

గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలి: ADB కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి పథకం అమలు తీరు పై శనివారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

News November 2, 2024

సిరికొండ: బావిలో పడి పదేళ్ల బాలుడి మృతి

image

సిరికొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అనంతపూర్‌కు చెందిన తోడసం నాగు- ఇస్రుబాయి దంపతుల కుమారుడు లాల్ సావ్ (10) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయం స్థానికులు గ్రామ పొలిమేరలో గాలించగా బావిలో బాలుడు శవమై కనిపించాడు. దీంతో వారు బాలుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 2, 2024

ADB: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

ఓ బాలిక (17)ను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని మోసం చేసిన కేసులో నిందితుడి పై మావల పీఎస్‌లో అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఇర్ఫాన్ పై అట్రాసిటీ, పోక్సో కేసును నమోదు చేశామన్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.