News November 8, 2024
ADB: సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సంబంధిత సర్వే నిర్వహిస్తున్న మండల టీమ్‌లతో శుక్రవారం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో ఎక్కడ కూడా పొరపాట్లకు, తప్పులకు తావివ్వకుండా సరైన సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు.
Similar News
News December 23, 2025
ADB: డాక్యుమెంట్ రైటర్‌పై కేసులు

ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న సుభాష్ నగర్‌కు చెందిన వెన్నం నవీన్ పై 2 కేసులు నమోదు చేసినట్లు 2టౌన్ CI నాగరాజు తెలిపారు. సదానందం 2023లో కొనుగోలు చేసిన ప్లాటుకు సంబంధించిన దస్తావేజుల్లో హద్దులు సరిచేసి ఇవ్వటానికి రూ.లక్ష తీసుకున్నాడు. అదే విధంగా మరొకరి దగ్గర దస్తావేజుల్లోనూ మార్పులు చేయటానికి రూ.56వేలు తీసుకొని ఇబ్బందులకు గురిచేయగా బాధితులు ఫిర్యాదు చేశారు.
News December 23, 2025
ఉట్నూర్: 7 ఏళ్లకు లభించిన భూమి పట్టా

ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన మండే మల్లారి, సండే సారూబాయ్‌లకు 7 సంవత్సరాలకు భూమి పట్టా లభించిందని ITDA PO యువరాజ్ మర్మాట్ తెలిపారు. సోమవారం పట్టాలను వారికి అందజేశారు. తాండ్ర గ్రామ శివారులో గల 49/23/1/2 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాలు, 49/23/3 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాల భూమి విస్తీర్ణానికి పట్టా చేసి లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు.