News October 20, 2024

ADB: సర్పంచ్, ఉప సర్పంచ్ అవ్వాల్సిందే!

image

కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి.. ఏదైతేనేం ఎలాగైనా సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.

Similar News

News November 5, 2024

నిర్మల్: బేస్ బాల్ ఆడుతూ తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి

image

నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఎంజేపీ పాఠశాలలో ఉదయం బేస్ బాల్ ఆడుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న అయాన్(14) అనే విద్యార్థి వాలీబాల్ ఆడుతూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. బాలుడి స్వగ్రామం దిలావర్పూర్ మండలం లోలం గ్రామం. ఫిట్స్ రావడంతోనే బాలుడు చనిపోయినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

News November 5, 2024

బెల్లంపల్లి: ‘రాజకీయ అండతోనే భూకబ్జాకు ప్రయత్నం’

image

బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ సంజీవని హనుమాన్ దేవాలయ భూములను పరిరక్షించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రేవల్లి రాజలింగు మాట్లాడుతూ.. దేవాలయ భూముల కబ్జాకు దౌర్జన్యంగా రాజకీయ అండతోనే కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్న దుండగులపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

News November 5, 2024

మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి ఆటో డ్రైవర్

image

మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ఆటోలో గోదావరిఖనికి చెందిన ప్రయాణికుడు మందమర్రిలో ఆటో దిగి బ్యాగ్ మర్చిపోయాడు.బెల్లంపల్లికి చేరుకున్న ఆటో డ్రైవర్ తిరుపతి విషయాన్ని బెల్లంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు కట్టరాం కుమార్ కి సమాచారం అందించారు. అయిన ద్వారా బ్యాగుని బాధితుడికి అప్పచెప్పారు. బ్యాగ్‌లో విలువైన బ్యాంక్ పత్రాలు, కొత్త బట్టలు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.