News August 22, 2024
ADB: స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను LG హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ద్వారా అభ్యర్థులకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ADB బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 18నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న వారు శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 24 వరకు tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 15, 2025
జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ
నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభను చాటింది. నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. ఢిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది.
News January 15, 2025
బెజ్జూర్: తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య
బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన కావిడె నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తండ్రి దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్సై ప్రవీణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు నవీన్ను మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు..
News January 15, 2025
జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ
నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభ చాటింది. పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. దిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది..