News February 12, 2026
ADB: హంగ్ వస్తే.. ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లే కీలకం..?

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకుంటే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లే కీలకం కానున్నాయి. ఆదిలాబాద్‌లో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లాలో ఎక్కడైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నా, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ADBలోనే ఓటు వేయాలని ఎంపీ నిర్ణయించుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ దండే విఠల్ కాగజ్‌నగర్‌లో తన ఓటును నమోదు చేసుకున్నారు.
Similar News
News March 9, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి AIIMS వసతిగృహంలో డయేరియా కలకలం రేపింది. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ పరిస్థితికి కారణమని అనుమానిస్తున్న అధికారులు, హాస్టల్ నుంచి 40 నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
News March 9, 2026
ఆ ముగ్గురికీ T20WC ట్రోఫీ అంకితం: గంభీర్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ T20WC విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్‌లకు అంకితం ఇచ్చారు. టీమ్ గెలుపు బాటలో నడవడానికి అవసరమైన వ్యవస్థను వారు నిర్మించారని కొనియాడారు. ‘ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు స్థిరత్వాన్ని కాపాడారు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ లక్ష్మణ్ జాతీయ స్థాయిలో ప్రతిభను వెలికితీస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News March 9, 2026
BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.


