News February 22, 2025
ADB: హెయిర్ కలర్ తాగి ఆత్మహత్య

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మావల ఎస్‌ఐ విష్ణువర్ధన్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక దస్నాపూర్‌కు చెందిన విజయ్ మేస్త్రీ పనిచేసేవాడు. అతనికి అప్పు ఉండడంతో మద్యానికి బానిసగా మారాడు. ఈనెల 18న హెయిర్ కలర్ తాగగా వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్‌లో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!
News March 27, 2025
ADB: శిక్షణ, ఉపాధి కోసం దరఖాస్తుల ఆహ్వానం

అదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, మైనార్టీ యువకులకు టెలి హెల్త్ సర్వీస్ కోఆర్డినేటర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఉచిత భోజన వసతులతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి ఆసక్తి గలవారు ఈ నెల 28న అన్ని ధ్రువీకరణ పత్రాలు, పాస్ ఫోటోలతో ఆదిలాబాద్ టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు.
News March 27, 2025
ADB: జాతీయస్థాయి టోర్నీకి రితీక

బిహార్‌లో నేటి నుంచి 30 తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణ బాలికల జట్టుకు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి జాబడే రితీక ఎంపికయ్యారు. జాతీయస్థాయి టోర్నీకి రితీక ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ గోడం నగేశ్, ఛైర్మన్ పాయల్ శంకర్, అధ్యక్షుడు రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ హర్షం వ్యక్తం చేశారు.