News August 10, 2025

ADB: ‘అంకితభావంతో పని చేయాలి’

image

అంకితభావంతో పని చేయాలని ఆదిలాబాద్‌ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుపుల దేవిదాస్ అన్నారు. ఆదివారం కైలాశ్‌నగర్‌లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభ్యుల సంక్షేమం కోసం భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలను దేవిదాస్ వివరించారు. కార్యక్రమంలో ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులు ఆనంద్ కుమార్, నిహాల్ సింగ్, కమలాకర్‌రెడ్డి, కొత్తపల్లి కృష్ణ, స్వామి, హరికృష్ణ ఉన్నారు.

Similar News

News September 9, 2025

ఆదిలాబాద్ – నాందేడ్ రైలు ఆలస్యం

image

నాందేడ్ డివిజన్‌లో రైల్వేలైన్ క్రాస్‌ఓవర్ కనెక్షన్ పనుల కారణంగా ఆదిలాబాద్ – నాందేడ్ రైలు (17409) ఆలస్యంగా నడవనుంది. ఈ నెల 15, 17, 18, 24, 25, 26 తేదీల్లో ఈ రైలు ఆలస్యంగా బయలుదేరుతుందని, మధ్యలో ఒక స్టేషన్‌లో ఎక్కువ సమయం ఆగుతుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

News September 9, 2025

ADB: ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్.. ఐదుగురిపై కేసు

image

ఆదిలాబాద్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణానికి చెందిన గణేష్, గౌతం, ప్రశాంత్, మునీశ్వర్, మహేష్ ఎమ్మెల్యే పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారన్నారు. వాటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన పోస్టులు గొడవలకు దారి తీసేలా ఉండటంతో నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.

News September 9, 2025

ఆదిలాబాద్: ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమావేశం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాజర్షి షా క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా, గ్రామ పంచాయితీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ప్రచురణపై ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై చర్చించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించమన్నారు.