News October 8, 2025

ADB: అడ్మిషన్ల గడువు పొడగింపు

image

TOSS ద్వారా ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో అడ్మిషన్లకు దరఖాస్తుల గడువు పొడగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఖుష్బూ గుప్తా తెలిపారు. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాద రుసుముతో ఈ నెల 14 నుంచి 23 వరకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 8, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో అమ్రిత్ సంవాద్ కార్యక్రమం

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బుధవారం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారి ‘అమ్రిత్ సంవాద్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం పవన్ కుమార్ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు ఎస్కలేటర్ వద్ద వృద్ధుల కోసం కేర్ టేకర్, రైలులో మగ, ఆడవాళ్లకి వేర్వేరుగా బాత్రూం ఏర్పాటు చేయాలని సూచించారు.

News October 8, 2025

VZM: ‘వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ’

image

జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ఎస్.రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖ వివిధ విభాగాల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వేడి నీరు, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.

News October 8, 2025

రేపు ఉదయం 10.30 గంటలకు..

image

TG: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ రేపు 10.30AMకు విడుదల చేయాలని SEC రాణి కుముదిని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నోటిఫికేషన్‌తో పాటు ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలన్నారు‌. OCT 9-11 వరకు ప్రతిరోజు ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు <<17863320>>నామినేషన్లను<<>> స్వీకరించాలని పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.