News April 3, 2024

ADB: అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిపై వేటు

image

అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాద్యాయుడు మహేందర్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ప్రణీత మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్చి నెల 9 నుంచి 14 వరకు స్కూల్ అసిస్టెంట్ మహేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లారని ఆయనపై పీఆర్టీయూ తెలంగాణ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతడిపై విచారణ జరిపించి వేటువేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Similar News

News January 15, 2025

క్రీడలతో శారీరక ఆరోగ్యం: బోథ్ MLA

image

నేరడిగొండ మండలంలోని బొందిడిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. అనంతరం యువకులతో కలిసి బ్యాటింగ్ చేసి సందడి చేశారు.

News January 15, 2025

జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ

image

నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభను చాటింది. నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. ఢిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది.

News January 15, 2025

బెజ్జూర్: తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య

image

బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన కావిడె నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తండ్రి దేవయ్య ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్సై ప్రవీణ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు నవీన్‌ను మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు..