News March 19, 2024

ADB: అన్న చనిపోయాడని సమాచారం.. తమ్ముడికి గుండెపోటు

image

చావు గురించి తప్పుడు సమాచారం ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో జరిగింది. బోథ్‌కు చెందిన నరసింహదాస్‌, బాపు ఇద్దరు అన్నదమ్ములు. అనారోగ్యంతో బాధపడుతున్న బాపు బతికే ఉన్నా, ఆయన చనిపోయాడంటూ బంధువులు ఫోన్‌ చేసి చెప్పడంతో తమ్ముడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అన్న ఇక లేడని రోదించిన దాస్ గంటల వ్యవధిలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నింపింది.

Similar News

News December 28, 2024

ADB: ఆదివారం కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులు

image

డా. BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3 ,5 సెమిస్టర్ విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులను ఈనెల 29న ఆదిలాబాద్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ శనివారం పేర్కొన్నారు. పీజీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

News December 28, 2024

ఆసిఫాబాద్: ఏడాదిలో 1207 కేసులు నమోదు

image

ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే హత్య కేసులు 45.45%, రోడ్డు ప్రమాదాలు 1.6% తగ్గాయని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SPవార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. 2024లో జిల్లాలో 12 హత్య కేసులు, 82ఆస్తి సంబంధిత నేరాలు, 3నేర పూరిత నరహత్యలు, 04దొమ్మి కేసులు,18 కిడ్నాప్‌లు, 24 రేప్‌లు, 34 SC,STనేరాలు, 27పోక్సో,39 గంజాయి కేసులు, 188మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయాయన్నారు.

News December 28, 2024

ఆదిలాబాద్: ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ అడ్మిషన్ల గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ ప్రణీత పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 24తో గడువు ముగియగా ఈనెల 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కావున విద్యార్థులు www.Telanganaopenschool.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. SHARE IT