News December 10, 2025
ADB: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. ”అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News December 11, 2025
హీరాపూర్: కోడలిపై అత్త విజయం

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.
News December 11, 2025
ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.
News December 11, 2025
ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.


