News October 11, 2025

ADB: అమ్మను కాపాడుకుందాం..!

image

MHకు చెందిన దంపతులు భీంపూర్ మండలానికి చెందిన ఓ బాలికను రూ.10వేలకు విక్రయించిన విషయం తెలిసిందే. జిల్లాలో తరచూ బాల్య వివాహాలు, పోక్సో కేసులు నమోదవుతున్నాయి. నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతినబూనుదాం. బాలికలకు అండగా నిలబడుతామని, వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మార్చడం వంటివి చేస్తే 1098, 112, 1081, 100 నంబర్లకి కాల్ చేసి చెబుదాం.
#నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం

SHARE IT

Similar News

News October 11, 2025

ఇదేందయ్యా ఇది.. 100కు 137 మార్కులా?

image

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని MBM ఇంజినీరింగ్ వర్సిటీలో BE II సెమిస్టర్ విద్యార్థులకు ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 100 మార్కులకు ఏకంగా 103 నుంచి 137 రావడంతో అవాక్కయ్యారు. విషయం కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో మార్కులను వెబ్‌సైట్ నుంచి తొలగించారు. టెక్నికల్ తప్పిదం వల్ల ఇలా జరిగినట్లు ఎగ్జామ్ కంట్రోలర్ అనిల్ గుప్తా తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News October 11, 2025

14న రాజమండ్రిలో జాబ్ మేళా

image

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో మంగళవారం ప్రముఖ వాయుపుత్ర మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎంఎస్) కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. 2020–2025 మధ్య డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News October 11, 2025

ఉస్మానియాలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం!

image

ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆస్పత్రి కడుతోన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని కోరుతున్నారు.