News April 7, 2024
ADB: ఆటో బోల్తా ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి జైనథ్ వైపు వెళ్తున్న ఆటో.. తర్నం బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న భరత్‌కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందగా పుష్ప, పద్మా అనే మహిళలకు గాయాలయ్యాయి. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ సాయినాథ్ తెలిపారు.
Similar News
News December 25, 2024
ADB: సమగ్ర శిక్ష ఉద్యోగులకు తుడుందెబ్బ మద్దతు
టీపీసీసీ అధ్యక్ష హోదాలో వరంగల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆదివాసీ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
News December 25, 2024
ఆదిలాబాద్: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
News December 25, 2024
తాండూరు మండలంలో పులి సంచారం.. ?
తాండూరు మండలంలోని నీలాయపల్లికి కూత వేటు దూరంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలియడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దూడపై దాడి చేసింది పెద్దపులా.. చిరుత పులా అనేది తెలియాల్సి ఉంది. దూడపై పులి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.