News March 1, 2026
ADB: ఆదర్శం.. ఆ గ్రామంలో కట్న, కానుకలు నిషేధం

సామాజిక మార్పు దిశగా ఇంద్రవెల్లి(M) ప్రధాన్‌గూడ, హీరాసుఖనగర (కొబ్బైగూడ) గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఆదివారం గ్రామ పెద్దలు సమావేశమై శుభకార్యాల్లో కట్న, కానుకలను పూర్తిగా నిషేధిస్తూ చారిత్రక తీర్మానం చేశారు. దీనికి బదులుగా, ఏ ఇంట్లో వేడుక జరిగినా గ్రామంలోని ప్రతి ఇల్లు ₹300 చొప్పున చందా జమ చేసి, ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలవాలని నిర్ణయించారు. ఈ ఉమ్మడి పంచాయతీలో సుమారు 500 మంది ఓటర్లున్నారు.
Similar News
News March 1, 2026
బాధ్యతలు స్వీకరించిన తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ

తిరుపతి జిల్లా క్రైమ్ విభాగం అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. చోరీలు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు కట్టుబడి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని ఆర్ల శ్రీనివాసులు తెలిపారు.
News March 1, 2026
INDvsWI.. ఒకే ఓవర్లో 24 రన్స్

వెస్టిండీస్‌తో మ్యాచులో భారత పేసర్ అర్ష్‌దీప్ ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన వేసిన 16వ ఓవర్లో వరుసగా 1, 0, 1, 5WD, 6, WD, 6, 4 వచ్చాయి. విండీస్ బ్యాటర్ పావెల్ చివరి 3 బంతుల్లో వరుసగా 6, 6, 4 బాదారు.
News March 1, 2026
నెల్లూరు GGH ఘటనపై స్పందించిన కలెక్టర్, ఎస్పీ

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఎస్పీ తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని రోగులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని కలెక్టర్ తెలిపారు.


