News January 17, 2026

ADB: ఆదర్శ పాఠశాల అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి ADB జిల్లాలో 14 మోడల్ పాఠశాలలో 2026- 27 సం.రానికి సంబంధించి 6వ తరగతి, 7- 10 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. JAN 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 9 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వివరాల కోసం https://tgms .telangana.gov.inలో సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 13, 2026

మున్సిపల్ ఫలితాలు.. భార్యాభర్తలు, తల్లీకొడుకులు విజయాలు

image

TG: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో భార్యాభర్తలు జయకేతనం ఎగురవేశారు. 13వ వార్డు నుంచి జూపల్లి రమేశ్, 6వ వార్డు నుంచి శశికళ కాంగ్రెస్ కౌన్సిలర్లుగా గెలిచారు. మెదక్ జిల్లా రామాయంపేటలోనూ భార్య లావణ్య (1వ వార్డు), భర్త నాగరాజు (7వ వార్డు) కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మరోవైపు మెదక్‌లో తల్లీకొడుకులు జయకేతనం ఎగురవేశారు. 17వ వార్డు నుంచి లలిత, 29వ వార్డు నుంచి ఉదయ్ BRS తరఫున గెలిచారు.

News February 13, 2026

కాంగ్రెస్ పార్టీకి షాక్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతున్న కాంగ్రెస్ పార్టీకి రెండు మున్సిపాలిటీల్లో ఫలితాలు షాకిచ్చాయి. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హవా కొనసాగించింది. అక్కడ 16 వార్డులకుగాను గులాబీ పార్టీ 9 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఏడు స్థానాలకే పరిమితమైంది. ఇక దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులుండగా ఇప్పటివరకు కాంగ్రెస్ ఒక్క వార్డులోనూ గెలవలేదు.

News February 13, 2026

BREAKING: మధిర మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకా మధిర మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ సాధించింది. ఇక్కడ మొత్తం 22 వార్డులకు గాను 14 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 1 వార్డు BRS, 1 వార్డు ఇతరులు గెలిచారు. మిగితా వార్డుల్లో కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.