News April 4, 2025
ADB ఆదివాసీ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శిగా వరుణ్

ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధానకార్యదర్శిగా వరుణ్ ను ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివాసీ విద్యార్థి సంఘం సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా వరుణ్ మరోసారి ఎన్నుకున్నారు. ఆదివాసి విద్యార్థుల సమస్యలపై పోరాడుతానని, ఆదివాసుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News April 10, 2025
ADBలో ఏడుగురి అరెస్ట్: CI

ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. శాంతినగర్‌లో CCS ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారని ADB ఒకటో పట్టణ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.2,620 నగదు, ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.
News April 10, 2025
ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్‌గా సలోని చాబ్రా

ఆదిలాబాద్ జిల్లాకు ట్రైనీ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సలోని చాబ్రాను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.శాంతికుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం ఈ జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లుగా సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్‌గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.
News April 10, 2025
9రోజుల్లో.. 70 శాతం సన్నబియ్యం పంపిణీ: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలోని 356 రేషన్ షాపులకుగాను 6 లక్షల 32 వేల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఈ పథకం ద్వారా 9 రోజుల్లో 70 శాతం సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 4,127 మెట్రిక్ టన్నుల బియ్యం, అదనంగా కొత్తగా 14,322 మంది చేరినట్లు చెప్పారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు.