News March 18, 2025

ADB: ఆరుగురు మహిళలు అరెస్ట్: CI

image

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళా గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు ADB టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలో దాడులు నిర్వహించగా మట్కా నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. కాగా ఇందులో నలుగురు ఆడవాళ్లు, ఇద్దరు మగవారు ఉన్నారు. మట్కా చిట్టీలతోపాటు 2 సెల్ ఫోన్లు, రూ.2,260 నగదు స్వాధీనం చేసుకొని.. వారిపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 5, 2025

ఉట్నూర్: ఈ నెల 11న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపఃల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో, 26 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డులతో కళాశాలలో హాజరు కావాలన్నారు. వివరాలకు 9885762227, 9321825562ను సంప్రదించాలాన్నారు

News November 5, 2025

పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు, పారదర్శకతకు కట్టుబడి ఉండాలని సూచించారు.

News November 5, 2025

UTNR: కొత్త ఐటీడీఏ పీవో ముందున్న సవాళ్లివే

image

ఉట్నూర్ ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీవోగా యువరాజ్ మర్మాట్ నియమితులయ్యారు. పీవీటీజీల అభివృద్ధి, గిరిజన గ్రామాల్లో వైద్యం, మౌలిక వసతుల కల్పన వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో సమస్యల పరిష్కారం, రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రవేశపెట్టిన మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి.