News August 15, 2025
ADB: ఆ గ్రామంలో మొదటిసారి జెండా ఆవిష్కరణ

ASF(D) కెరమెరి(M) బాబేఝరి పంచాయతీ పరిధిలోని పాటగూడలో తొలిసారి త్రివర్ణపతాకం ఎగిరింది. దేశానికి స్వతంత్రం వచ్చి 79ఏళ్లు గడిచినా ఆ గ్రామంలో ఇప్పటి వరకు జెండా ఎగరేయలేదు. దాదాపు 30 ఇళ్లున్న గ్రామంలో బడి, ప్రభుత్వ కార్యాలయాలు లేకపోవడంతో ఎలాంటి కార్యక్రమాలు జరపలేదు. ఈసారి ప్రభుత్వ బడిని ప్రారంభించారు. గ్రామంలోని పిల్లలకు విద్య అందుతోందని, మొదటిసారి జాతీయ పతాకం ఎగిరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News August 15, 2025
విశాఖలో 250 మంది బిచ్చగాళ్లకు షెల్టర్

రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విశాఖ సీపీ నగరంలో బిక్షటాన చేస్తున్న 250 మందిని తీసుకువచ్చి షెల్టర్ కల్పించారు. చోడుపల్లి పైడమ్మ (77) శ్రీహరిపురంలో ఎండు చేపలు అమ్ముతూ ఉండేది. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుమారుడు సాంబమూర్తి వెతకడం ప్రారంభించాడు. అయితే పోలీసులు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఆమె పట్టుబడింది. పోలీసుల సంరక్షణలో ఉన్న ఆమెను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News August 15, 2025
KNR: మద్యం అమ్మారు.. కేసు నమోదు చేశారు

KNR(D) తిమ్మాపూర్(M) అలుగునూర్‌లోని ఓ <<17416197>>షాపులో <<>>పంద్రాగష్టు రోజు మద్యం అమ్మిన విషయం తెలిసిందే. అయితే, తిమ్మాపూర్ SI శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.33,000 విలువగల మద్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. అక్రమమద్యం అమ్ముతున్న మంజయ్య, లక్ష్మణ్, లక్ష్మణ్‌పై కేసులు నమోదు చేశామని SI తెలిపారు. ఇలా ఎవరైనా చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిపితే కేసు నమోదుచేస్తామని హెచ్చరించారు.
News August 15, 2025
మేడ్చల్: ప్రోత్సాహక చెక్కులు అందించిన కలెక్టర్

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు చెక్కులు అందజేశారు. జానం సోనీ(579), చీకటి త్రివేణి(572), కుర్మ రాజ్ కుమార్(563), శీలంశెట్టి సాయి విఘ్నేశ్ (561)కి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 ప్రోత్సాహకం అందజేశారు. భవిష్యత్‌లో మరింత శ్రమించి ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.