News March 17, 2025
ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

సహజంగా ఏ రైతైనా పంట తొలికాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. ADBజిల్లా తాంసి మండలం పొన్నారికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలికాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలా ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News February 22, 2026
సిద్దిపేట: గ్రామం నుంచి ALL INDIA పోటీలకు

రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి.సతీశ్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్‌లో జరగనున్నాయి.
News February 22, 2026
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.
News February 22, 2026
భారీగా తగ్గిన క్యారెట్, బీట్‌రూట్ ధరలు

AP: రాష్ట్రంలో క్యారెట్, బీట్‌రూట్ ధరలు పడిపోయాయి. సాధారణంగా ఇవి కేజీకి రూ.80-100 చొప్పున విక్రయిస్తారు. అయితే రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకలో క్యారెట్, బీట్‌రూట్ సాగు పెరగడంతో ధరలు దిగివచ్చాయి. దీంతో క్యారెట్, బీట్‌రూట్ కేజీకి రూ.30-40 చొప్పున లభ్యమవుతున్నాయి. అటు తెలంగాణలోనూ వీటి ధరలు కాస్త తగ్గి కేజీ రూ.50-70 మధ్య ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


