News December 16, 2025

ADB: ఇక్కడ 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు

image

GP ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ GPకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 1956లో ఎన్నికలు జరగగా తిరిగి ఈ సంవత్సరం సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. గ్రామంలోని 2257 ఓటర్లు ఈ నెల 17న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News December 16, 2025

ఆర్మూర్: ఎన్నికలు జరగనున్న సర్పంచ్ స్థానాలు 146

image

ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోగల గ్రామాలలో రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 3వ విడత పోలింగ్ జరగనుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికలు జరగనున్న సర్పంచ్ స్థానాలు:146
పోటీలో ఉన్న అభ్యర్థులు: 562
ఓటర్ల సంఖ్య: 3,06,795
పోలింగ్ కేంద్రాలు: 1490

News December 16, 2025

నల్గొండ: B.Ed సెమిస్టర్-1,3 విద్యార్థులకు అలర్ట్

image

MGU పరిధిలో B.Ed సెమిస్టర్ 1,3 (Reg) సంబంధించిన పరీక్ష ఫీజును జనవరి 5 వరకు ఫైన్ లేకుండా చెల్లించవచ్చని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్.ఉపేందర్ రెడ్డి తెలిపారు. గడువు దాటితే ఫైన్ ఉంటుందని చెప్పారు. బీఈడీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎగ్జామ్స్ టైం టేబుల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

News December 16, 2025

విద్యార్థులకు ఉచితంగా ఆధార్‌ బయోమెట్రిక్‌: కలెక్టర్‌

image

5 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్‌ బయోమెట్రిక్ అప్‌డేట్‌ చేసుకోవాలని అంబేడ్కర్‌ కోనసీమ కలెక్టర్‌ మహేశ్ కుమార్‌ సూచించారు. మంగళవారం ఆయన అమలాపురం కలెక్టరేట్‌లో మాట్లాడారు. కేంద్ర నిబంధనల మేరకు ఈ సేవలకు సంబంధించిన రుసుమును ఏడాది పాటు పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు ఈ విషయంపై శ్రద్ధ వహించి, విద్యార్థులందరితో అప్‌డేట్‌ చేయించాలని ఆదేశించారు.