News April 18, 2024

ADB: ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ ప్రణీత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై ఆయా శాఖల వారి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉదయం పూట ఇంటర్, మధ్యాహ్నం పదో తరగతి పరీక్షలు ఉంటాయని ఇంటర్ పరీక్షలకు 463 మంది, పదో తరగతి పరీక్షలకు 792 మంది హాజరవుతారని పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 20, 2026

చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు: ఎస్పీ

image

చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయటం, సోషల్ మీడియాలో షేర్ చేయటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్ “చైల్డ్ టిప్ లైన్” పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

News February 20, 2026

ఆదిలాబాద్: ఈనెల 24న జాబ్ మేళా

image

ఆదిలాబాద జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35 లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News February 20, 2026

ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.