News October 9, 2025
ADB: ఈ కార్యాలయాలు మారాయి.. గమనించండి

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం పాక్షికంగా కూలిపోవడంతో పలు కార్యాలయాలు తాత్కాలిక మార్పులు జరిగాయని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) పెన్ గంగ భవన్కు, కలెక్టరేట్ విభాగాలు AO నుంచి H వరకు పెన్ గంగ భవన్కు, తహశీల్దార్ (అర్బన్) జెడ్పీ ఆఫీస్కు, డీఎస్ఓ ఆఫీస్ రోడ్లు భవనాల (R&B) శాఖ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News October 9, 2025
ADB: లోకల్ వార్.. బరిలోకి కామ్రేడ్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి కామ్రేడ్లు సైతం బరిలో నిలవనున్నారు. 6 జడ్పీటీసీ స్థానాలు, 9 ఎంపీటీసీ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు పొటీ చేసేందుకు నిర్వహించారు. బోథ్, రూరల్, తాంసి, నార్నూర్, భీంపూర్, మావల, భోరజ్ ZPTC, బోథ్-1, బోథ్-2, అందూర్, బండల్ నాగపూర్, కప్పర్ల, తాంసి, భీంపూర్ వడుర్, భోరజ్, పెండల్వాడ, బాలాపూర్ MPTC స్థానాల్లో బరిలోకి దిగనున్నారు.
News October 9, 2025
ADB: లోకల్ వార్.. MEDIAపై FOCUS

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం మీడియాపై పూర్తిస్థాయి నిఘా పెట్టాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలు, ప్రచారాలపై దృష్టి సారించాలి. తప్పుడు వార్తలు, పెయిడ్ న్యూస్, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరిగితే గుర్తించి, కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం మీడియా మానిటరింగ్, సర్టిఫికేషన్ కమిటీలని ప్రారంభించారు.
News October 9, 2025
ADB: స్కాలర్ షిప్ కోసం APPLY చేసుకోండి

2025-26 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ పాస్ http://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖాధికారి రాజలింగు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారి వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలు ఉండాలన్నారు.
..SHARE IT