News April 7, 2026

ADB: ఈ నెల 10న జాబ్ మేళా

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 10న ప్రభుత్వ ITI కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఎంపికైన వారికి రూ.16 – 20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20 నుంచి 28సం.రాలలోపు గల యువకులు అర్హులన్నారు. SSC, BA, BSC, B.COM పాసై ఆసక్తి గలవారు ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News April 9, 2026

BREAKING: ఆదిలాబాద్ జిల్లాలో ACB దాడులు

image

ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. బోథ్ ఫారెస్ట్ ఆఫీస్‌లో దాడులు నిర్వహించగా లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టుపట్టారు. ACB DSP ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కాసేపట్లో ఆయన వివరాలు వెల్లడించనున్నారు.

News April 9, 2026

ADB: అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక.. రాంజీ గోండ్

image

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ADB అడవుల్లో విప్లవ శంఖం పూరించిన వీరయోధుడు రాంజీ గోండ్ వర్ధంతి నేడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో గిరిజనులను ఏకం చేసి, గెరిల్లా యుద్ధ తంత్రంతో ఆంగ్లేయ సేనలను గడగడలాడించిన ధీశాలి ఆయన. మడమ తిప్పని పోరాటం చేస్తూ చివరికి శత్రువులకు చిక్కి ఉరికొయ్యను ముద్దాడిన ఆయన త్యాగం, నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.

News April 8, 2026

రాష్ట్రంలో రెండో స్థానం సాధించిన ADB షీ టీమ్: SP

image

మహిళలు, చిన్నారుల భద్రతలో విశేష ప్రతిభ కనబరిచి ఏప్రిల్ నెల రాష్ట్ర సమీక్షలో ఆదిలాబాద్ షీ టీమ్ రెండో స్థానం సాధించింది. క్లస్టర్-IVలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. 65 ఫిర్యాదులు స్వీకరించి 9 FIRలు, 40 కేసులు నమోదు చేసి 52 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 39 గ్రామాల సందర్శనతో 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాల్యవివాహాల నివారణలో కీలక పాత్ర పోషించిందని SP అఖిల్ మహాజన్ వెల్లడించారు.