News April 19, 2025
ADB: ఈ నెల 20న MJP బ్యాక్ లాగ్ సెట్

ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, బాలికల గురుకులాల్లోని 6,7,8,9 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు RCO శ్రీధర్ తెలిపారు. ఎంజేపీ బ్యాక్లాగ్ సెట్ ఈ నెల 20న ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,308 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష ప్రారంభమవుతుందని, గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Similar News
News September 10, 2025
ఆదిలాబాద్ : ఇంగ్లీష్ అధ్యాపక పోస్టుకై డెమోకు ఆహ్వానం

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు నేరుగా డెమోకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం తెలిపారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 12న కళాశాలలో జరిగే డెమోకు నేరుగా హాజరు కావాలన్నారు.
News September 10, 2025
ఆదిలాబాద్: INTERలో చేరేందుకు మరో అవకాశం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేందుకు మరొకసారి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ డీఐఈఓ జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరాలనుకుంటే ఈనెల 11, 12 తేదీల్లో అడ్మిషన్ పొందాలని సూచించారు. అలాగే లాంగ్వేజ్ మార్పు చేసుకునేందుకు కూడా ఈ రెండు రోజులే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 10, 2025
గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

ADB జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారి చేసింది. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్టర్ మోహన్‌ను నియమించారు. మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనుండగా… ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ జరగనుంది. 17న పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.