News August 13, 2024
ADB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈ నెల 20 లోగ సంబంధిత ఎంఈవోలకు దరఖాస్తు పెట్టుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో MEOలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ సేవలందించిన ముగ్గురు ఉపాధ్యాయులను ఎన్నిక చేసి ఈ నెల 24 న జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో సమర్పించాలని ఎంఈవోలకు ఆమె సూచించారు.
Similar News
News February 22, 2026
ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
News February 22, 2026
ఆదిలాబాద్ : రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. సమాచార సహాయక కేంద్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను నమోదు చేసి, సత్వర పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.