News April 17, 2025

ADB: ఉద్యోగాలు.. APPLY NOW

image

అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు నమోదుకు ఈనెల 25వ వరకు గడువు పొడిగించినట్లు ADB జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ 2025-28 సంవత్సరానికి అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 13, 2025

అలాంటి చర్యలు చేపట్టిన వారిపై చర్యలు: ADB ఎస్పీ

image

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ రూరల్, బోరజ్, జైనథ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ కాకుండా గస్తీ నిర్వహించాలన్నారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

News December 13, 2025

ఆదిలాబాద్: రేపే పోలింగ్.. ఏకగ్రీవమైన పంచాయతీలు ఇవే

image

ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో 2వ విడత పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దమాలే బోరిగాం, అసోద, అల్లికోరి, హత్తిగుట్ట, చాంద్ పల్లి, అడ, పూసాయి, మార్కగూడ, జల్ కోరి, కరుణ్ వాడి, టెక్డి రాంపూర్, భగవాన్ పూర్, పార్డి (బి), జంబుల్ దరి, లింగు గూడ, అట్నమ్ గూడ, అంబుగాం పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మావల మండలంలో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.

News December 13, 2025

పోలింగ్‌కు పగడ్బందిగా ఏర్పాట్లు: ఆదిలాబాద్ కలెక్టర్

image

ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సాత్నాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. తహశీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.