News March 31, 2024
ADB: ‘ఉపాద్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకొవాలని జిల్లా విద్యాధికారి ప్రణీత ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు మంచి నీటిని అందుబాటులొ ఉంచాలని, ఎండలో ఆడుకోకుండా చూడాలన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు మధ్యాహ్నం వేళల్లో తరగతులు నిర్వహించరాదని హెచ్చరించారు.
Similar News
News January 13, 2025
ADB: జనవరి 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో MRPS నాయకుడు ఎల్లన్న ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూర్యప్రసాద్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యదర్శిగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. ఈనెల 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ వస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
News January 13, 2025
సిర్పూర్(టి): పశువుల రవాణా.. ముగ్గురి ARREST
అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో ఆదివారం పట్టుకున్నారు. అనంతరం పశువులను గోశాలలకు తరలించి, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News January 13, 2025
కోటపల్లి: కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు
కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.