News January 5, 2025

ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. శనివారం ఉష్ణోగ్రతలు అతి అల్పానికి చేరుకున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా సిర్పూర్(U) 6.1, ఆదిలాబాద్ జిల్లాలో అర్లి(T) 6.2, నిర్మల్ జిల్లాలో కుబీర్ 8.8, మంచిర్యాల జిల్లాలో జైపూర్ 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లా వాసులు తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News January 7, 2025

జిల్లా తుది ఓటరు జాబితా విడుదల:  MNCL కలెక్టర్

image

మంచిర్యాల జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా నూతన ఓటరు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందిన తుది ఓటరు జాబితా ప్రచురించినట్లు పేర్కొన్నారు.

News January 7, 2025

MNCL: పరీక్షల షెడ్యూల్ విడుదల..!

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు- 2024.-25 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్, 11న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12 నుంచి 16 వరకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

News January 6, 2025

స్త్రీలను కోటీశ్వరులను చేసేందుకు కృషి: MNCL కలెక్టర్

image

ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కుమార్ దీపక్ అన్నారు. ముల్కల్ల పంచాయతీ వీరాంజనేయులు SHG సభ్యురాలు విజయకు సంచార చేపలు విక్రయించేందుకు వాహనాన్ని సోమవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతతో వ్యాపారాన్ని నిర్వర్తించి కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.