News June 20, 2024

ADB: ఉమ్మడి జిల్లాకు రూ.5వేల కోట్లు అవసరం

image

రైతు రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా పథకాలను కొనసాగించాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.5వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. కాగా జిల్లాలో 3.90 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.2.500 కోట్లు, రైతు భరోసా కింద 6 లక్షల మంది రైతులకు రూ.1,730.2 కోట్లు, రైతు బీమా కింద 3.09లక్షల మంది రైతులకు రూ.111.73 కోట్లు అవసరం ఉంది.

Similar News

News September 29, 2024

ఆదిలాబాద్: DEECET విద్యార్థులకు GOOD NEWS

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో TG DEECET-2024లో ర్యాంక్ సాధించి ఆగస్టు నెలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థులకు మరొకసారి అవకాశం కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో అక్టోబర్ 1న ఉ.10 నుంచి సా.5 గంటల వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 29, 2024

ASF: రేపు జోనల్ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

image

ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో సోమవారం SGFజోనల్ స్థాయి అండర్-17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు DEOయాదయ్య, SGF జిల్లా సెక్రటరీ సాంబశివరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంట్రీ ఫామ్‌లతో ఉదయం 9గంటలకు హాజరుకావాలన్నారు. వివరాలకు TW క్రీడల అధికారి మీనారెడ్డి, కోచ్ అరవింద్‌ను సంప్రదించాలని సూచించారు.

News September 29, 2024

బాసర: నవరాత్రుల ఉత్సవాల్లో ఈ సేవలు రద్దు

image

బాసర అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో పలు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 11వరకు అభిషేకాలు, 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు రద్దు, 11 నుంచి 13 చండీహోమం, 12న ఉదయం 10 గం.ల వరకు అక్షరాభ్యాసములు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.