News May 18, 2024

ADB ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 9 మంది మృతి

image

ఉమ్మడి ADB జిల్లాలో వివిధ కారణాలతో శుక్రవారం 9 మంది మృతిచెందారు.
ADBలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి. మావల, కుంటాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి. ఇంద్రవెల్లిలో కడుపు నొప్పి భరించలేక యువతి సూసైడ్. వాంకిడిలో ఇష్టంలేని పెళ్లి చేశారని నవవరుడు సూసైడ్. ఆసిఫాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఖానాపూర్‌లో బైక్‌తో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి. కాసిపేటలో ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.

Similar News

News March 2, 2026

హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ADB SP

image

హోలీ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తుతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఎవరిపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. ఈత రానివారు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News March 2, 2026

ADB: పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు బంగారుగూడ, జైనథ్, బజార్హత్నూర్, నార్నూర్, గుడిహత్నూర్, బోథ్ ప్రవేశ పరీక్ష -2026-27 విద్యా సంవత్సరానికి VI తరగతిలో ప్రవేశాలకు గడువు తేదీని పొడగించినట్లు DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే VII నుంచి X తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ మార్చి10 వరకు పొడగించమన్నారు. ఏప్రిల్ 19న పరీక్ష ఉంటుందని తెలిపారు.

News March 2, 2026

ADB: ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం

image

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ – 100’ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో హెల్త్ మిషన్ – 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.