News April 7, 2024
ADB: ఉమ్మడి జిల్లాలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం గరిష్ఠంగా మంచిర్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 41, ఆదిలాబాద్ 42.4, నిర్మల్ 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Similar News
News April 5, 2026
ADB: సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజావాణి రద్దు

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 6న రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News April 5, 2026
ADB: 7న డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

ఆదిలాబాద్ శాంతినగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 7న (మంగళవారం) మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత తెలిపారు. టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో టాస్క్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సౌజన్యంతో జరిగే ఈ మేళాలో 15 వరకు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.