News March 9, 2026

ADB: ఎత్తిపోతలు.. ఉత్తిదేనా?

image

రూ.కోట్లతో నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, పెద్దవాగులపై గత ప్రభుత్వాలు 72 పథకాలను మంజూరు చేశాయి. కాగా ASF జిల్లాలో 14కి 2, ADBలో 27కి 9 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. NRMLలోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం రూ.14 కోట్లు విడుదల చేస్తే ఈ లిఫ్టుల మరమ్మతులు పూర్తయి దాదాపు 27 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రానుందని రైతులు చెబుతున్నారు.

Similar News

News March 9, 2026

గద్వాల: బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం: అదనపు ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం అందిస్తామని జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్ డే’లో ఆయన పాల్గొని 5 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

News March 9, 2026

మాజీ ఎంపీ తలారి రంగయ్యకు ప్రాణహాని: నారాయణ

image

కళ్యాణదుర్గం ఈ-స్టాంప్ కుంభకోణంపై హైకోర్టులో పోరాడుతున్న మాజీ ఎంపీ డా. తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని YCP నాయకులు నారాయణ, తిమ్మరాయుడు తెలిపారు. తక్షణమే ఆయనకు 2+2 పోలీసు భద్రత కల్పించాలని సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. స్కామ్ బాధ్యుల నుంచి రంగయ్యకు ముప్పు ఉందని ఆరోపించారు.

News March 9, 2026

పల్నాడు: పోలీస్ గ్రీవెన్స్‌కు 62 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, ఆస్తి సంబంధిత సమస్యలపై మొత్తం 62 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.