News April 1, 2024
ADB: ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాకు రాహుల్ గాంధీ: సీతక్క
ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గాంధీని చంపిన గాడ్సేకు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే దండగ.. బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాదన్నారు. ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు.
Similar News
News January 14, 2025
భీమారం: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల అద్వైకరాజ్ దుర్మరణం చెందింది. మంతెన రాజ్ కుమార్ తన భార్య సురేఖ, కుమార్తె అద్వైకరాజ్, తల్లి లక్ష్మమ్మ, మేనకోడలు తేజశ్రీతో కలిసి తమిళనాడులోని ఒక చర్చికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
News January 14, 2025
ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు
డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరం స్పెల్-II, ఓల్డ్ బ్యాచ్ 2016 అంతకుముందు బ్యాచ్‌ల వారు అలాగే రీ అడ్మిషన్ తీసుకున్న వారు సప్లిమెంటరీ ఫీజును ఈ నెల ఈనెల 14వరకు చెల్లించవచ్చన్నారు. ఇందుకు రూ. 500 అపరాధ రుసుం కట్టాలన్నారు.
News January 14, 2025
కెరమెరి అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచారం
కెరమెరి రేంజ్ పరిధిలోని నిశాని, ఇందాపూర్, కరంజీ వాడ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే కెరమెరి మండలంలోని కారంజీ వాడ,నిషానీ, ఇందాపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాకు చిక్కాయని కేరమేరీ రేంజ్ అధికారి మజారుద్దీన్ తెలిపారు.. దీంతో అటవీ సమీపంలోని గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..