News May 12, 2024
ADB: ఎన్నికల విధుల్లో ఒకేచోట SI అన్నదమ్ములు

ఆదిలాబాద్ టీటీడీసీ కేంద్రంలో ఈవీఎం మిషన్ల పంపిణీ ఆదివారం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా మండల పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలు విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చారు. అయితే ఎన్నికల విధుల్లో ఇద్దరు ఎస్ఐలు పాల్గొనగా.. వారిద్దరూ అన్నదమ్ములు అవ్వడం విశేషం. మావల పోలీస్ స్టేషన్ SI విష్ణువర్ధన్, జైనథ్ పోలీస్ స్టేషన్ SI పురుషోత్తం ఇక్కడే విధులు నిర్వర్తించారు.
Similar News
News February 28, 2026
ADB జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: SP

మార్చి ఒకటి నుంచి 31 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డీఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 28, 2026
ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.
News February 28, 2026
ఆదిలాబాద్: ఇంగ్లిష్ పరీక్షకు 364 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేష్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారని, 364 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.


