News April 8, 2025
ADB: ఎమ్మెల్యేను కలిసిన జనార్దన్ రాథోడ్

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని సోమవారం ఆదిలాబాద్ మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్టీ బలోపేతంపై నాయకులు, కార్యకర్తలతో కలిసి చర్చించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే మహాసభను విజయవంతం చేయాలనీ ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్నూర్ PACS ఛైర్మన్ సురేష్ ఆడే, మాజీ సర్పంచి రామేశ్వర్ తదితరులున్నారు.
Similar News
News April 21, 2025
ఆదిలాబాద్: బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలో గతంలో రెన్యూవల్ కాని 3 బార్ల నోటిఫికేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ADB ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రేండ్ల విజేందర్ పేర్కొన్నారు. ఆసక్తి గల వారు అప్లికేషన్ ఫారమ్‌తో పాటు రూ.లక్ష డీడీ, చలాన్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి పేరున చెల్లించి, ఈనెల 26 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు 8712658771 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
News April 21, 2025
అనేక భాషలకు పుట్టినిల్లు ఉమ్మడి ఆదిలాబాద్

ADB తెలంగాణ కశ్మీర్‌గా ప్రసిద్ధి. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ ఎండా, వాన, చలి అన్నీ ఎక్కువే. అంతేకాదండోయ్.. ఎన్నో భాషలకు పుట్టినిల్లు కూడా. తెలుగు ప్రజలు అధికంగా ఉన్నా ఉర్దూ, హిందీ మాట్లాడుతారు. MHకి సరిహద్దులో ఉండడంతో మరాఠీ, ఆదివాసీల గోండు, కొలాం, గిరిజనుల లంబాడీ, మథుర భాషలు ప్రత్యేకం. అందరూ కలిసి ఉండడంతో ఒక భాషలో పదాలు మరో భాషలో విరివిరిగా ఉపయోగిస్తుంటారు. మీదే భాషనో కామెంట్ చేయండి.
News April 21, 2025
ADB: మృతదేహంపై కత్తిపోట్లు.. హత్యగా అనుమానం

భోరజ్ మండలం పెన్‌గంగా సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌కు సమాచారం అందించారు. మృతుడి ముఖంపై, ఛాతి భాగంలో కత్తిపోట్లు ఉన్నాయన్నారు. మహరాష్ట్ర వాసిగా అనుమానిస్తున్నామని.. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని వివరించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే సమాచారం అందించాలన్నారు.