News March 17, 2025
ADB: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు DEO ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
HYD: జవాన్ల కోసం 3D ప్రింటింగ్ భవనం

సివిల్ ఇంజినీరింగ్‌లో టెక్నాలజీ రోజు రోజుకు నూతన పుంతలు తొక్కుతోంది. దేశంలోని తొలిసారి జవాన్ల కోసం మధ్యప్రదేశ్ గాల్వియర్‌లో 3D ప్రింటింగ్ భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో మన IIT హైదరాబాద్ కీలకపాత్ర పోషించింది. ఇందులో ఏకంగా సుమారు 14 మంది జవాన్లు నివసించే అవకాశం ఉంటుంది. సాధారణ నిర్మాణాలు సాధ్యం కాని ప్రాంతాలలో ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు.
News July 6, 2025
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

TG: తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 2.50 లక్షల ఇళ్ల పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. కొత్తగూడెంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల జారీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్హులైనా, ఇళ్లు రానివారు నిరుత్సాహపడొద్దన్నారు. రాబోయే రోజుల్లో మిగతావారికి విడతలవారీగా కేటాయిస్తామని తెలిపారు. BRSలా ఊహజనిత మాటలు తాము చెప్పబోమన్నారు.
News July 6, 2025
మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారా?

టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ‘<<16960204>>అమెరికా పార్టీ<<>>’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన భవిష్యత్తులో అగ్రరాజ్య అధ్యక్షుడు అవుతారా? అనే చర్చ మొదలైంది. అయితే US రాజ్యాంగం ప్రకారం మస్క్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. ఆర్టికల్ 2లోని సెక్షన్ 1 ప్రకారం ప్రెసిడెంట్ అభ్యర్థి కావాలంటే USలోనే జన్మించాలి. కానీ ఈ అపర కుబేరుడు సౌతాఫ్రికాలో జన్మించారు. దీంతో మస్క్ మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టాల్సిందే.