News April 4, 2025
ADB: ‘ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు నిర్వహించాలి’

ఓపెన్ స్కూల్ సోసైటి ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కే.శ్యామలాదేవి అన్నారు. గురువారం వివిధ పరీక్ష నిర్వహణ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది హాజరవుతారన్నారు. వీరికి ఏప్రిల్ 20వ తేది నుంచి ఏప్రిల్ 26 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
విద్యార్థులకు మెరుగైన విద్య అందించండి: ITDA PO

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ కుష్బూగుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలను పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని సూచించారు.
News April 4, 2025
ADB: శభాష్.. AIతో చక్కగా చదువు చెబుతున్నారు: DEO

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేస్తున్న ఆదిలాబాద్‌లోని రణదివ్యనగర్ ప్రభుత్వ పాఠశాలలను డీఈవో శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి హర్షం వ్యక్తం చేసి ఉపాధ్యాయులను అభినందించారు. అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గౌడ్, సీసీ రాజేశ్వర్ తదితరులున్నారు.
News April 4, 2025
ఉట్నూర్: ‘TASK శిక్షణతో ఉపాధి సాధన సులువు’

యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ సాధనకు మార్గాన్ని సులువు చేయడమే లక్ష్యంగా టాస్క్ ముందుకు సాగుతుందని ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో Campus to Corporate C2C అంశంపై రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ తరగతులకు కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.