News May 23, 2024

ADB: ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను అభివృద్ధి చేస్తాం: పీవో

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను బలోపేతం చేయటంతో పాటు అభివృద్ధి చేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని జంబుగాలో ఉన్న ఐటీడీఏ ఉద్యాన నర్సరీ, శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. నర్సరీ ద్వారా మెరుగైన ఆదాయం పొందటంతో పాటు, దినసరి కూలీలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఓ సూచించారు.

Similar News

News September 29, 2024

ఆసిఫాబాద్: ‘రాజీ మార్గమే రాజా మార్గం’

image

రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి.రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.

News September 28, 2024

ఆదిలాబాద్‌లో లోక్ అదాలత్‌కు భారీ స్పందన

image

జాతీయ లోక్ అదాలత్ కు భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. అదిలాబాద్, ఉట్నూర్, బోథ్ అదిలాబాద్ న్యాయస్థానాల్లో వివిధ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న 954 పోలీస్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. రూ.12 లక్షల పైచిలుకు జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 287 ఎఫ్ఐఆర్, 665 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారం అయిందన్నారు. 18 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.3,71,175/- తిరిగి అందించామన్నారు.

News September 28, 2024

MNCL: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట సంతోష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారంతో వ్యభిచారం నిర్వహిస్తున్న తోట మహేందర్, ఓ మహిళ, విటుడు బోలెం శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.