News March 19, 2025

ADB: ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు: DSP

image

యువత గంజాయి మత్తు బారిన పడకుండా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇద్దరు గంజాయి అమ్మేవారు, ఒకరు గంజాయి పండించేవాడు, ఇద్దరు గంజాయి తాగే వారున్నారని తెలిపారు. వీరి నుంచి 35 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Similar News

News December 14, 2025

83.80 శాతం పోలింగ్ నమోదు

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.

News December 14, 2025

సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగిన ADB కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా పలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావల మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్లు అందంగా తయారు చేశారు. కేంద్రం పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓటర్లతో కలిసి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగారు.

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 58.17% పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 58. 17% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 58.00 శాతం, బేల 59.09, జైనథ్‌ 56.45, బోరజ్‌ 55.49, భీంపూర్‌ 59.99, సాత్నాల 63.46, తాంసి 57.30, మావలలో 53.06 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.